కొత్త బంగారులోకం చిత్రంలో తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని విధంగా నటించింది శ్వేతా బసు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రంలో శ్వేతా బసు, వరుణ్ సందేశ్ జంటగా నటించారు. శ్వేతా బసు కెరీర్ లో అదొక మెమొరబుల్ మూవీ. కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల శ్వేతా బసుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. 

అదే సమయంలో శ్వేతా బసు సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో ఆమె కెరీర్ పై మరింతగా ప్రభావం పడింది. ఇదిలా ఉండాగా 2018లో శ్వేతా బసు.. రోహిత్ మిట్టల్ అనే వర్తమాన దర్శకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఏడాది లోపే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి విడిపోయారు. 

800 కోట్ల బిజినెస్, భారీ నష్టాల్లో సురేష్ బాబు.. లబోదిబోమంటున్నారు

తమ డివోర్స్ విషయాన్ని శ్వేతా బసు అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి శ్వేతా బసు ఒంటరిగానే ఉంటోంది. డిప్రెషన్ కారణంగా శ్వేతా బసుకి మానసిక సమస్యలు తలెత్తాయి. దీనితో శ్వేతా బసు మానసిక వైద్యుడి దగ్గర చికిత్స చేయించుకుని కోలుకుంది. 

మరోసారి శ్వేతా బసుకి మానసిక సమస్యలు తిరబెట్టాయట. గత ఏడాది డిసెంబర్ నుంచి తాను డిప్రెషన్ లో ఉన్నట్లు శ్వేతా ఓ ఇంటర్వ్యూలు పేర్కొంది. ప్రస్తుతం మరోసారి చికిత్స చేయించుకు కుంటున్నానని, లాక్ డౌన్ కారణంగా వైద్యుడు తనకు ఆన్ లైన్ లోనే సలహాలు ఇస్తున్నారని శ్వేతా తెలిపింది.