Asianet News TeluguAsianet News Telugu

800 కోట్ల బిజినెస్, భారీ నష్టాల్లో సురేష్ బాబు.. లబోదిబోమంటున్నారు

భారత చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటోంది అని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు

Suresh Babu suffers heavy losses due to Corona effect on film industry
Author
Hyderabad, First Published Apr 21, 2020, 11:35 AM IST

భారత చిత్ర పరిశ్రమ మునుపెన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటోంది అని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కరోనా ప్రభావం వల్ల సినిమా బిజినెస్ తో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ లబోదిబోమంటున్నారు అని సురేష్ బాబు అన్నారు. 

ముఖ్యంగా థియేటర్ బిజినెస్, ఎగ్జిబిటర్లు దారుణంగా నష్టపోతున్నారు అని సురేష్ బాబు తెలిపారు. ఇది చరిత్రలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితి. ప్రపంచంలోనే వాల్ట్ డిస్ని అతిపెద్ద మీడియా సంస్థ. ఆ సంస్థే కరోనా లాక్ డౌన్ కారణంగా కుదుపునకు గురైందని సురేష్ బాబు అన్నారు. 

గతంలో చిత్ర పరిశ్రమపై వరదలు, తుఫానులు, బంద్ ల ప్రభావం ఉండేది.  ఆ సమయాల్లో సులువుగా తట్టుకుని నిలబడ్డాం. కానీ కరోనా జన జీవితాలని, ఆర్థిక స్థితిని మార్చేసింది అని సురేష్ బాబు అన్నారు. 

వ్యక్తిగతంగా తన విషయానికి వస్తే.. తనకు 800 కోట్ల థియేటర్ బిజినెస్ ఉందని సురేష్ బాబు అన్నారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి. పివిఆర్ సంస్థకు 10000 కోట్లు, ఐనాక్స్ కి 5000 కోట్ల బిజినెస్ ఉంది. ప్రస్తుతం తామంతా 50 శాతం నష్టాలని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సురేష్ బాబు వాపోయారు. 

ఈ వయసులో నటి ప్రగతి యోగాసనాలు.. పిచ్చ హాట్ బాబోయ్

ఇక తాను నిర్మిస్తున్న నారప్ప చిత్రంపై కూడా కరోనా ప్రభావం పడిందని అన్నారు. నారప్ప పూర్తి కావడానికి ఇంకా 25 రోజుల షూటింగ్ అవసరం. హిరణ్యకశ్యప కోసం ఇప్పటికే చాలా వెచ్చించాం. కాజల్, నివేత థామస్ లాంటి హీరోయిన్లతో సినిమాలు ప్లాన్ చేశాం. కరోనా కారణంగా తాము ఇన్వాల్వ్ అయిన ప్రతి ప్రాజెక్ట్ లో ఎంతోకొంత నష్టపోక తప్పని పరిస్థితి అని సురేష్ బాబు అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios