సౌత్ కొరియాకి చెందిన కొందరు ఆర్టిస్టులు మానసిక పరిస్థితి కారణంగా మృత్యువు ఒడిలో చేరుతున్నారు. కొంతకాలం క్రితం పలువురు ఆర్టిస్ట్ లు ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. గతంలో కొరియన్ పాప్ స్టార్ సులీ పాతికేళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు. 

అది జరిగిన ఆరు నెలల తరువాత మరో ఆర్టిస్ట్ గో హరా మృతదేహం ఒక అపార్ట్మెంట్ లో దొరికింది. ఈ ఘటనల కారణంగా సౌత్ కొరియాకి చెందిన కొందరు ఆర్టిస్ట్ ల మానసిక స్థితి దిగజారిందని, నటన విషయంలో ఒత్తిడి  ఎదురవుతున్నదని అంటున్నారు. ఇదే కోవలో ఇప్పుడు మరో ఘటన చోటుచేసుకుంది.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?

కొరియాలో 'ది బ్యాంకర్', 'లవ్ విత్ ఫ్లాస్' వంటి డ్రామా షోలలో నటించిన ఛా ఇన్ హా(27)అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అతని అభిమానులకు తీవ్రంగా కలచివేస్తోంది. ఛా ఇన్ హా మృతి చెందిన విషయాన్ని దక్షిణ కొరియా పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు.

అతడి మరణానికి గల కారణాలు తెలియలేదు. అయితే ఈ విషయంలో ఎలాంటి రూమర్లను స్ప్రెడ్ చేయకుండా ఉండాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఛా ఇన్ హా అంతిమ సంస్కారాలను కూడా ప్రైవేట్ గా ఎలాంటి హడావిడి లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారు.