టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరో బిగ్ బడ్జెట్ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కొరటాలతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఓ వైపు రామ్ చరణ్ కూడా తండ్రి 152వ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అయితే హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది.  మెయిన్ హీరోయిన్ కోసం త్రిష ను సంప్రదించినట్లు గత కొంత కాలంగా అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన అన్ని రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు కొరటాల సిద్దమైనట్లు తెలుస్తోంది.

నాకైతే ఆశలు లేవు.. చిరు152పై రాంచరణ్ కామెంట్స్!

ముఖ్యంగా హీరోయిన్ విషయంలో వీలైనంత త్వరగా అధికారిక ప్రకటనను రిలీజ్ చేయాలనీ రామ్ చరణ్ కూడా దర్శకుడికి చెప్పినట్లు టాక్.  అయితే సినిమాలో అన్ని పాత్రలని సెలెక్ట్ చేసుకున్న తరువాతే అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాలనీ డైరెక్టర్ ఆలోచిస్తున్నారు. త్రిషతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే కానీ ఇంకా ఫైనల్ చేయలేదని టాక్ కూడా వస్తోంది.

ఇక దానిపై నెక్స్ట్ వీక్ లో దర్శకుడు కొరటాల క్లారిటీ ఇవ్వడానికి సిద్దమవుతున్నాడు. అలాగే సినిమాకు సంబందించిన టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో మంచి ఉపుమీదున్న కొరటాల మెగాస్టార్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.