'సైరా నరసింహారెడ్డి' సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నటించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓకే అనిపించుకుంది. ఎప్పటినుండో ఓ భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీ చేయాలనుకున్న చిరంజీవికి ఈ సినిమాతో ఆశ నెరవేరింది.

ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. వరుస హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు కొరటాలతో కలిసి సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఇప్పటికే షూటింగ్ మొదలుకావాలి కానీ ఆలస్యమవుతూ వస్తోంది.

దానికి కారణం కొరటాల శివ.. చిరంజీవి లుక్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే.. ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండాలనే విషయంపై కొరటాల చాలా కసరత్తులు చేశాడు. ఫైనల్ గా చిరంజీవి లుక్ టెస్ట్ ముగిసింది. అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిపై నిర్వహించిన ఫోటోషూట్ లో అతడి లుక్ ని ఫిక్స్ చేశారు.

దేవిశ్రీ ఫ్యామిలీ నుండి మరో రాక్ స్టార్.. డ్రమ్స్ పగిలిపోవాల్సిందే!

దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ కి లైన్ క్లియర్ అయింది. జనవరి 2 నుండి చిరంజీవి-కొరటాల సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ సినిమా కూడా కొరటాల శివ స్టైల్ లో సామాజిక అంశాలు, సందేశాలతో ముడిపడి ఉండే కథ అని తెలుస్తోంది. అయినప్పటికీ కమర్షియల్ హంగులకి లోటేమీ ఉండదని అంటున్నారు.

చిరు కెరీర్ లో ఇదొక మైలు రాయి చిత్రంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ మీద రామ్ చరణే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో చరణ్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిషని తీసుకుంటున్నారని సమాచారం. మణిశర్మని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. 2020 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.