Asianet News TeluguAsianet News Telugu

Director K Jayadev: చిత్రసీమలో విషాదం.. ప్రముఖ సినీ దర్శకుడి హఠాత్తు మరణం.. 

బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్, డైరెక్టర్ కే జయదేవ్ హఠాత్తుగా మృతి చెందారు. 'కోరంగి నుంచి' అనే సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

Korangi Nunchi Movie Director K Jayadev Passed Away KRJ
Author
First Published Jan 9, 2024, 12:25 AM IST

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ , సినీ దర్శకుడు కె.జయదేవ్ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి గుండె పోటుతో హైదరాబాద్ లో ఆయన చనిపోయారు. జయదేవ్ దర్శకత్వం వహించిన “కోరంగి నుంచి” చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఈ చిత్రాన్ని జాతీయ చలన చిత్రాభివృద్ది సంస్థ నిర్మించింది.

ఈ చిత్రం జాతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ఆయన భారతరత్న సి.ఎన్.ఆర్. రావు పై ఫిలిమ్స్ డివిజన్ కు డాక్యుమెంటరీ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు జరలిస్టు  కె ఎన్ టి శాస్త్రి కి జయదేవ్ చిన్న కుమారుడు. ఉత్తమ సినీ విమర్శకుడిగా కేఎన్‌టీ శాస్త్రి జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న  విషయం తెలిసిందే. ఇక జయదేవ్ కు భార్య యశోద, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios