మెగా డాటర్ సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. రంగస్థలం, సైరా చిత్రాలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఇటీవల సుస్మిత ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, రాంచరణ్ లలో ఎవరు బెస్ట్ డాన్సర్ అనే చర్చ వచ్చింది. సుస్మిత మాత్రం తన తమ్ముడికి కాకుండా అల్లు అర్జున్ కే ఓటు వేసింది. బన్నీ బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చింది. 

అదే ఇంటర్వ్యూలో సుస్మిత మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. రామ్ చరణ్ ఏదైనా సీక్వెల్ చేయాల్సి వస్తే అది ఏ మూవీ అయితే బావుంటుందని అని ప్రశ్నించగా.. సుస్మిత జగదేక వీరుడు అతిలోక సుందరి అని చెప్పింది. ఆ చిత్రానికి నిజంగా సీక్వెల్ వస్తే తన తమ్ముడికి అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూరే సరైన జోడి అని సుస్మిత తెలిపింది. 

కరోనా పాజిటివ్ సింగర్ పై దర్శకుడు ఫైర్.. 400 మందితో పార్టీ, విచ్చలవిడిగా తిరిగింది

1990లో రాఘవేంద్ర రావు దర్శత్వంలో, అశ్విని దత్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి, శ్రీదేవి కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ చిత్రంలో చిరు పెర్ఫామెన్స్, శ్రీదేవి అందాలు ఎవర్గ్రీన్.