బేబీ డాల్ ఫేమ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం ఆమె లండన్ నుంచి తిరిగివచ్చింది. ఆ సమయంలో కనికాకు కరోనా లక్షణాలు కనిపించలేదు. కానీ తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) పాటిస్తున్నారు. 

కానీ కనికా మాత్రం లండన్ నుంచ్చి రాగానే 400 మందితో పార్టీలో పాల్గొంది. దీనితో ఆమెని కలసిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై ప్రముఖ దర్శకుడు, ఇండియన్ ఫిలిం, టెలివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అశోక్ పండిట్ స్పందించారు. సింగర్ కనికా లండన్ నుంచి తిరిగివచ్చాక హోమ్ క్వారంటైన్ పాటించకుండా పార్టీల పేరుతో విచ్చలవిడిగా తిరిగింది అని మండి పడ్డారు.

మెస్మరైజ్ చేసేలా అనసూయ హాట్ ఫోజులు

లండన్ నుంచి వచ్చాక నీ ప్రయాణ వివరాలని దాచిపెట్టావు.. 5 స్టార్ హోటల్స్ లో పార్టీలో తిరిగావు. వందలాది మందిని కలిసావు. నీకు ఇప్పుడు కరోనా పాజిటివ్.. నిన్ను కలసిన వారందరి జీవితాలు కూడా ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి అని కనికాపై అశోక్ మండిపడ్డారు. 

కనికాకు పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రభావం రాజస్థాన్  సీఎం వసుంధర రాజేపై కూడా పడింది. కనికా ఉత్తరప్రదేశ్ లో ఇచ్చిన పార్టీలో వసుంధర రాజే, ఆమె తనయుడు దుశ్యంత్ పాల్గొన్నారు. దీనితో ప్రస్తుతం తామిద్దరం స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు వసుంధర రాజే తెలిపారు.