Asianet News TeluguAsianet News Telugu

పాయింట్ ఇంట్రస్టింగ్..ఎగ్జిక్యూషన్ ఫెయిల్!

కథ విషయానికి వస్తే..పూర్తి గ్రామీణ ప్రాంతంలో కథ జరుగుతుంది. కోనాపురం ,  దాని పక్క గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి పదిహేను రోజులకు వరుసగా ఒకొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు

Konapuram Lo Jarigina Katha movie  fails to engage the audience
Author
Hyderabad, First Published Nov 9, 2019, 9:57 AM IST

నిన్న శుక్రవారం రిలీజైన మరో చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. చిన్న సినిమాలు వరసగా సక్సెస్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమాపై ట్రేడ్ లో కొద్దిగా అంచనాలు ఏర్పడ్డాయి. రెండు ఊళ్ల మధ్య గొడవల నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీగా సాగే ఈ సినిమా బి,సి సెంటర్లలో అయినా వర్కవుట్ అవుతుందనుకున్నారు. అయితే చాలా చిన్న సినిమాల్లాగే ఈ సినిమా కూడా సరైన కంటెంట్ లేక బోల్తా పడింది.  

కథ విషయానికి వస్తే..పూర్తి గ్రామీణ ప్రాంతంలో కథ జరుగుతుంది. కోనాపురం ,  దాని పక్క గ్రామంలో పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి పదిహేను రోజులకు వరుసగా ఒకొక్కరు హత్యకు గురవుతూ ఉంటారు. దాంతో ప్రశాంతంగా ఉన్న ఆ రెండు గ్రామాలు ఆ వరుస మర్డర్స్ తో ఉలిక్కి పడతాయి. ఇంతకీ ఆ హత్యలు ఎలా జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? హత్యలు చేస్తోన్న హంతకుడుని పట్టుకోవడానికి ఎలాంటి ఎంక్వైరీ జరుగుతోంది? వంటి విషయాలతో సినిమా నడుస్తుంది.

బాత్ టబ్ లో నగ్నంగా హీరోయిన్.. ఈమె ఏం చేసినా సంచలనమే!

 కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లు  సినిమాలో ఉన్నా  ఇంట్రస్టింగ్ గా సాగదు. కథా స్క్రీన్ ప్లేల్లో సరైన ప్లో లేకపోవడం, ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొట్టించడం వంటి అంశాలు సినిమా రిజల్ట్ ని పూర్తిగా దెబ్బ తీశాయి.

అనిల్‌ మొగిలి, రేయాన్‌ రాహుల్, సునీత ప్రధాన పాత్రల్లో కేబీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కోనాపురంలో జరిగిన కథ’. పోషం మట్టారెడ్డి సమర్పణలో అనూష సినిమా పతాకంపై మచ్చ వెంకట్‌ రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదల అయ్యింది.  ఈ చిత్రానికి సంగీతం: సత్య కశ్యప్, కెమెరా: ఈరుపుల శ్రీకాంత్‌. 

 

Follow Us:
Download App:
  • android
  • ios