అమలాపాల్ 2009లో నీల తామర అనే మలయాళీ చిత్రంతో నటిగా  పరిచయమైంది. తెలుగులో అమలాపాల్ నాయక్, జెండాపై కపిరాజు, ఇద్దరమ్మాయిలతో లాంటి చిత్రాల్లో నటించింది. కొంతకాలానికి అమలాపాల్ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. 

కానీ కొద్దిరోజులకే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల తర్వాత అమలాపాల్ కెరీర్ ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసింది. కేవలం కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాక లేడి ఓరియంటెడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. 

కొన్ని రోజుల క్రితం విడుదలైన ఆమె చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో అమలాపాల్ కెమెరా ముందు ఒంటిమీద నూలుపోగు లేకుండా నటించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. 

కథ నచ్చితే ఎలాంటి సాహసమైనా చేస్తానని అమలాపాల్ తెలిపింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమలాపాల్ చురుగ్గా ఉంటుంది. తరచుగా గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటోంది. తాజాగా అమలాపాల్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

అమలాపాల్ బాత్ టబ్ లో నగ్నంగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పూలతో నింపిన బాత్ టబ్ లో అమల హాట్ హాట్ గా ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి.