గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడుతున్నారు. తెలుగులో ఎన్నో వందలకు పైగా పాటలు పాడారు. ఆయన వయసు ఇప్పుడు 73 ఏళ్లు. వయసు పైబడడంతో ఆయనకి పాటలు పాడే అవకాశాలు తగ్గిపోయాయి. మన సంగీత దర్శకులు కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

తెలుగులో ఎప్పుడో కానీ ఒక పాట పాడే ఛాన్స్ రావడం లేదు. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తను సంగీతం అందిస్తోన్న 'డిస్కో రాజా' సినిమాలో ఎస్పీబీతో ఓ పాట పాడించారు. అది కూడా వింటేజ్ ఫీల్ ఉన్న సాంగ్.. రెగ్యులర్ పాటల కోసమైతే.. ఆయన్ని అసలు కన్సిడర్ చేయడం లేదు.

రెండు నెలల తరువాత అనౌన్స్ చేసిన సమంత!

కానీ కోలీవుడ్ లో మాత్రం మన దిగ్గజానికి మంచి గౌరవం దక్కుతోంది. పెద్ద పెద్ద సినిమాల్లో ఆయనకి పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ లాంటి ఈ తరం సంగీతం దర్శకుడు ఎస్పీబీతో వరుసగా పాటలు పాడిస్తుండడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'పేట' సినిమాలో ఎస్పీబీ తో పాట పాడించాడు అనిరుద్.

ఇప్పుడు రజినీకాంత్ నటిస్తోన్న 'దర్బార్' సినిమాలో మరోసారి బాలుకి ఛాన్స్ ఇచ్చాడు. 'చుమ్మా కిళి' అంటూ సాంగే పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంతో జోష్ తో పాడారు. ఈ పాటతో ఎస్పీబీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ పాట మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతోంది.

ఈ లిరికల్ వీడియోలో షూటింగ్ కి సంబంధించిన కొన్ని సీన్లను చూపించారు. ఈ పాట చివర్లో రజినీకాంత్ తనదైన స్టైల్ లో నవ్వుతూ మరింత జోష్ తీసుకొచ్చారు. ఇదే పాటను  'దుమ్మూ ధూళి' అంటూ సాగే తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు. మురుగదాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.