కోలీవుడ్ లో ఎంతమంది స్టార్ హిరోలున్నా విజయ్ సేతుపతికి ఉండే క్రేజే వేరు. మనోడు ఎలాంటి సినిమా చేసిన రిజల్ట్ తో సంబంధం లేకుండా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక నెక్స్ట్ ఈ హీరో వేసే అడుగులు చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ప్రయోగాత్మకమైన పాత్రలతో మెరిసిన సేతుపతి 2020లో మొత్తం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే దర్శనమివ్వనున్నాడు. 

నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న హీరోలు (రీసెంట్ మూవీస్)

అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో విలన్స్ గ కనిపించబోతున్నాడు. ఇళయథలపతి విజయ్ 64వ సినిమాలో సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో  ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాకు ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆ తరువాత కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.

ఆ సినిమా 2020 దీపావళికి రానుంది. ఇక తెలుగులో కూడా విజయ్ సేతుపతి ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ఇప్పటికే సైరా సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ లో కనిపించి మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో కూడా విలన్ గా కనిపించబోతున్నాడు.

 

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న డిఫరెంట్ యాక్షన్ డ్రామాలో కూడా విజయ్ భయంకర ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విధంగా వరుసగా విలన్ వేషాలతో విజయ్ సేతుపతి బిజీగా మారాడు. మరి ఆ పాత్రలతో ఈ హీరో ఎంతవరకు క్రేజ్ అందుకుంటాడో చూడాలి.