టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుస అవకాశాలతో బిజీ అవుతున్న యాక్టర్ సత్యరాజ్. బాహుబలి సినిమా అనంతరం ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ తో హాట్ టాపిక్ గా నిలిచారు. ఇకపోతే కట్టప్ప ఇప్పుడు చాలా కాస్ట్లీ అన్నట్లు సౌత్ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.

ఇంతకుముందు డైలీ పేమెంట్స్ తీసుకునే సత్యరాజ్ ఇప్పుడు రౌండ్ ఫిగర్ గా సినిమా మొత్తానికి పేమెంట్ అందుకుంటున్నారట.  సత్యరాజ్ ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోగా కొనసాగారు. కొన్నాళ్ల తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగవుతూ హీరోగా ఉన్నప్పటికి కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఒక సినిమాకు సత్యరాజ్ 2.5కోట్లు తీసుకుంటున్నారట.

also read గాయపడిన బాక్స్ ఆఫీస్ సింహాలు.. ఆశలన్నీ 2020పైనే..

తమిళ్ లో అయితే సత్యరాజ్ కి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారు. కానీ తెలుగులో వేరేవాళ్లతో చెప్పించాలి. అందుకు మరో 20లక్షలకు పైగా ఖర్చు. సత్యరాజ్ ఓ విధంగా తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువగా అవకాశాలను అందుకుంటున్నారు. మిర్చి సినిమా నుంచి వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.

వచ్చిన ప్రతి అఫర్ ని ఒప్పుకోకుండా కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఇటీవల నటించిన ప్రతిరోజు పండగే - కార్తీ 'దొంగ' సినిమాలకు ఆయన అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరికొన్ని ఆఫర్స్ పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.