ఇండియన్ క్రికెటర్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే పేరు కపిల్ దేవ్. ఇండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ స్థానం ఎప్పటికి పదిలం. కపిల్ దేవ్ సాధించిన ఘనతల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అతడి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలని ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు కబీర్ ఖాన్ నడుం బిగించారు. 

ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్న చిత్రం 83. కపిల్ దేవ్ జీవిత చరిత్ర, 1983 ప్రపంచ కప్ విజయం ప్రధాన అంశాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులని అలరించింది. రణవీర్ సింగ్ పూర్తిగా కపిల్ దేవ్ గెటప్ లోకి మారిపోయాడు. 

ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు బిజినెస్ ప్రారంభించేశారు. తెలుగులో ఈ చిత్ర రిలీజ్ కు సంబంధించి కింగ్ నాగార్జున ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలుగులో తాను ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలిపారు. 

మెగా హీరో 'ఉప్పెన' ఫస్ట్ లుక్ వచ్చేసింది.. చిరు మేనల్లుడికి బిగ్ టాస్క్!

'ఇండియా 83లో తొలి ప్రపంచ కప్ గెలిచింది. ఆ క్షణాలని గుర్తు చేసుకున్న ప్రతిసారి గూస్ బంప్స్ వస్తుంటాయి. తెలుగులో 83 చిత్రాన్ని ప్రజెంట్ చేయనుండడం సంతోషాన్నిచ్చే అంశం' అంటూ నాగార్జున 83 చిత్ర దర్శకుడు నిర్మాతలతో కలసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. 

క్రికెటర్స్ జీవిత చరిత్రల ఆధారంగా వస్తున్న బయోపిక్ చిత్రాలు విజయం సాధిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ చిత్రం ఎం ఎస్ ధోని విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.