కరోనా వైరస్ ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

దీనితో సామాన్య ప్రజల నుంచి, సెలెబ్రిటీల వరకు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సెలెబ్రిటీలు ఇళ్లలోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఇంట్లో క్వారంటైన్ టైంని ఎలా గడుపుతున్నారో తెలుపుతూ ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటున్నారు. 

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ వీడియో షేర్ చేశారు. తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా సోదరి ఖుషి కపూర్ ఎలా బంధించిందో తెలియజేస్తూ జాన్వీ కపూర్ వీడియో షేర్ చేసింది. 

కమెడియన్ బుల్లెట్ ప్రకాష్ అకాల మరణం.. హుటాహుటిన ఆసుపత్రికి స్టార్ హీరో

జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లకుండా ఖుషి కపూర్ ఆమె చేతిని కొరికి పట్టుకుని ఉంది. ఇలా తనని ఖుషి బంధించింది అంటూ జాన్వీ ఫన్నీగా చెబుతున్న వీడియో నెటిజన్లని ఆకట్టుకుంటోంది. మరి కొందరు అక్క చెల్లెళ్ళ బంధం చూసి మురిసిపోతున్నారు

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Siblings goals they are ☺❤💋

A post shared by @ janhvikapoorslays__ on Apr 6, 2020 at 4:16pm PDT