కన్నడ నాట స్టార్ కెమెడియన్ గా వెలుగొందుతున్న బుల్లెట్ ప్రకాష్(44) అకాల మరణం చెందారు. కన్నడలో ప్రకాష్ దాదాపు 200కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రకాష్ హాస్యం ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించింది. 

2002లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రకాష్ తక్కువ సమయంలోనే 200 చిత్రాల్లో నటించారు. గత కొంతకాలంగా ప్రకాష్ అనారోగ్యంతో భాదపడుతున్నారు. ఇటీవల అనారోగ్యం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని మార్చి 31న బెంగుళూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. 

అప్పటికే ప్రకాష్ శరీరంలో కిడ్నీ, లివర్ లాంటి పలు అవయవాలకు ఇన్ఫెక్క్షన్ సోకి పాడైనట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తుండగా ప్రకాష్ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 

దీనితో అతడి కుటుంబసభ్యులతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమ శోకంలో మునిగిపోయింది. బుల్లెట్ ప్రకాష్ గత ఐదు నెలల కాలంలోనే ఏకంగా 35 కేజీల బరువు కోల్పోయారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రకాష్ అనారోగ్యం ఎంత తీవ్రంగా మారిందో అని. 

బన్నీ - సుకుమార్ టైటిల్ ఇదా.. నమ్మొచ్చా?

ప్రకాష్ మరణ వార్త వినగానే కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రకాష్ మస్ట్ మజా మాడి, ఐత్తలకడి, ఆర్యన్, మల్లికార్జున లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ప్రకాష్ సెకండ్ సీజన్ కన్నడ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు.