కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కాస్త సీరియస్ గా అనిపిస్తాయి కానీ, కాలం గడిచి వాటిని తలుచుకుంటున్నప్పుడు నవ్వు వస్తూంటుంది. అలాంటి సంఘటనే ఖుష్బూ జీవితంలో జరిగిందిట. ఆ విషయాన్ని ఆమె అలీతో సరదాగా పోగ్రాంలో భాగంగా గుర్తు చేసుకున్నారు. తనకు విషయం తెలియకుండా నాగ్ ని ఓ చెత్త మాట అనేసానని అని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఖుష్భూ మాట్లాడుతూ... 1986లో ‘కెప్టెన్‌ నాగార్జున’ షూటింగ్‌ ఏవీఎం స్టూడియోలో జరిగింది. అప్పుడు నాకు తమిళ్‌, తెలుగు రాదు. చిన్ని ప్రకాష్‌ డ్యాన్స్‌ మాస్టర్‌కు సతీష్‌ అనే వ్యక్తి హెల్పర్ గా ఉండేవాడు. ‘మీరు తెలుగు రాష్ట్రంలో షూటింగ్‌ చేస్తున్నప్పుడు తెలుగులో, తమిళనాడులో జరుగుతుంటే తమిళంలో గుడ్‌మార్నింగ్‌ చెప్పాలి’ అని అన్నారు. ‘సరే చెప్పండి’ అని అడిగాను. ఆయన నాకు ఒక బ్యాడ్‌ వర్డ్‌ చెప్పి ఇలా అంటే గుడ్‌మార్నింగ్‌ అని చెప్పారు.

నాగ్ ని ఆ చెత్త మాట అనేసిన ఖుష్బూ...సెట్ లో షాక్‌

దీంతో షూటింగ్‌ సెట్‌లో ఉండగా, నేను బిల్డింగ్‌పైన ఉన్నా, అప్పుడు నాగార్జున వచ్చారు. దీంతో ఆ బ్యాడ్‌వర్డ్‌ గుడ్‌మార్నింగ్‌ అనుకొని ‘హాయ్‌ నాగ్‌’ అని అన్నాను. అంతే సెట్‌లోని వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. నాగార్జున పరిగెత్తుకుంటూ వచ్చి నా వెంటపడీ మరీ పట్టుకుని ‘ఈ చెత్తమాట ఎవరు చెప్పారు’ అని అడిగారు. ‘ఫలానా వ్యక్తి చెప్పాడు’ అని అన్నా.

ఇక ఖుష్బూ రాజకీయాల్లో ఉన్నా.. సినిమాలకు మాత్రం దూరం అవ్వలేదు. తనకు తగ్గ పాత్రలు వచ్చినప్పుడు... అడపాదడపా కీలక పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా పవన్‌ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసిలో ఆమె కీలక పాత్రలో మెప్పించారు. అలాగే  తమిళ్‌లో పలు రియాలిటీ షోస్‌కు వ్యాఖ్యతగా వ్వవహరించటంతో పాటు సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. సీరియల్స్‌ను నిర్మిస్తున్నారు.