ప్రపంచ వణికిస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జనాలు ఎక్కువగా తిరిగే సినిమా హాళ్లు, స్కూల్స్, క్లబ్బులు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్స్ లని ఇప్పటికే మూసివేశారు. 

సినీరంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్స్ రద్దైన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కావాల్సిన పలు చిత్రాలు వాయిదా పడుతున్నాయి. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ నటిస్తున్న సూర్యవంశీ చిత్రం మార్చి 24న విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేసారు. 

ఇలియానా ఎక్స్ పోజింగ్ చేస్తే ఓకే.. రష్మీపై దారుణంగా బూతు వ్యాఖ్యలు

36 ఏళ్ల వయసులో మెరుపుతీగలా కనిపించే కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో కత్రినా చాలా కేరింగ్ గా ఉంటుంది. క్రమం తప్పకుండా కత్రినా జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా జిమ్ సెంటర్లు మూతపడ్డాయి. అయినా కూడా కత్రినా కు కరోనా అడ్డు కాలేదు. 

తన ఇంట్లోనే మేడపై కసరత్తులు మొదలు పెట్టేసింది. తన ఫిజికల్ ట్రైలర్ ఆధ్వర్యంలో కత్రినా జిమ్ కసరత్తులు చేస్తున్న వీడియోల్ని అభిమానులతో పంచుకుంది.