సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది. ఏ విషయాన్నైనా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అయితే ఈ మాధ్యమాన్ని దుర్వినియోగం చేసేవారు లేకపోలేదు. కొంతమంది సెలబ్రిటీలపై నోటికొచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు.

ఎక్కువగా నటీమణులను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా నటి కస్తూరి కూడా ఇలాని అనుభవమే ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ అజిత్ అభిమాని అయిన ఓ నెటిజన్.. కస్తూరిని టార్గెట్ చేస్తూ దుర్భాషలాడాడు. ఈ కామెంట్స్ చూసిన కస్తూరి ఆగ్రహానికి లోనైంది.

ఆంటీ వయసులో అమ్మాయిలా రచ్చ చేస్తున్న సురేఖావాణి.. హాట్ ఫోటోలు!

అజిత్ లాంటి సూపర్ స్టార్ అభిమానిని అని చెప్పుకుంటూ తన క్యారెక్టర్ పై నీచమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలనుకున్నారు. వెంటనే ఆ ట్వీట్ కి బదులిస్తూ.. 'మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు.. కానీ ఇలా అజిత్ అభిమానినని చెప్పుకుంటూ ఆడవాళ్ల మీద నీచమైన కామెంట్స్ చేసే ఇలాంటి వాళ్లని ఏమనాలి..? అని ప్రశ్నించింది. మీకు అమ్మాయిలు సెక్స్ కోసమే కావాలంటే.. బయటకి వెళ్లడం ఎందుకు..? ఇంట్లో మీ అక్కనో, అమ్మనో అడగండి అంటూ ఘాటుగా బదులిచ్చింది.

అంతేకాదు.. ఇలాంటి సెక్సిస్ట్ కామెంట్స్ చేస్తున్న వారిపై ట్విట్టర్ చెర్యలు తీసుకోవాలని కోరారు. dirtyajithfans అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు. ఇది చూసిన అజిత్ ఫ్యాన్స్ కొంతమంది dirtykasturiaunty అంటూ కస్తూరిని టార్గెట్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇది చూసిన కస్తూరి.. తప్పు చేసిన వారిని కంట్రోల్ చేయాల్సిందిపోయి వారితో చేతులు కలిపి దిగజారిపోతున్నారంటూ మండిపడింది.