Asianet News TeluguAsianet News Telugu

‘90ఎమ్‌.ఎల్‌’ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన

తన హోమ్ ప్రొడక్షన్ లో హీరో కార్తికేయ నిర్మిస్తున్న  ‘90ఎమ్‌.ఎల్‌’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు.

Karthikeya's 90ml Movie release date locked
Author
Hyderabad, First Published Nov 11, 2019, 9:36 AM IST

హిప్పీ, గుణ 369 చిత్రాలు భాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో హీరో కార్తికేయ రేసులో వెనకబడ్డారు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ మొత్తం ఈ రెండు సినిమాలు మర్చిపోయేలా చేసాయి. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా అయినా కిక్ ఇస్తుందేమో అనుకుంటే అదీ ఎడ్రస్ లేకుండా పోయింది.  దాంతో ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాల్సిన పరిస్దితి కార్తికేయది.

ఈ నేపధ్యంలో ఈ సారి ఓ వైవిధ్యమైన కాన్సెప్టు తో కార్తికేయ మన ముందుకు రావటానికి సిద్దమయ్యారు. 90 ఎమ్.ఎల్ టైటిల్ తో ఆయన హిట్ కొడతానంటున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

తన హోమ్ ప్రొడక్షన్ లో హీరో కార్తికేయ నిర్మిస్తున్న  ‘90ఎమ్‌.ఎల్‌’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు.

పాత బంగారం: 1942లో సూపర్ హిట్టైన సినిమా పబ్లిసిటీ ట్రిక్

దర్శకుడు మాట్లాడుతూ ‘‘కార్తికేయకి తగ్గ కథ ఇది. చదువులో బంగారు పతకాలు గెలుచుకున్న దేవదాస్‌ పాత్రలో ఆయన పక్కాగా ఒదిగిపోయారు. అలాంటి కుర్రాడు మద్యానికి ఎలా బానిసయ్యాడన్నది తెరపైనే చూడాలి. అందరికీ వినోదం పంచుతుందీ చిత్రం. ఇటీవల అజర్‌బైజాన్‌లో మూడు పాటల్ని తెరకెక్కించాం. అవి చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘పేరుకు తగ్గట్టుగా వైవిధ్యమైన సినిమా ఇది. ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి’’అన్నారు.

 నేహా సోలంకి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ద్వారా శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను యూత్‌ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, విభిన్నమైన కథ మరియు కథనాలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తుండగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios