Asianet News TeluguAsianet News Telugu

'ఖైదీ' ఫైనల్ కలెక్షన్స్.. వాళ్లకు ఏడుపొకటే తక్కువ!

అందుతున్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం తెలుగు రెండు రాష్ట్రాల్లో  ఈ సినిమా 7.5 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాని మూడున్నర కోట్లకు కొన్నారు. దాంతో కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా మంచి లాభాలు వెనకేసారు.

Karthi's Khaidi Movie final collections
Author
Hyderabad, First Published Nov 26, 2019, 3:57 PM IST

కార్తికి గత కొంతకాలంగా భాక్సాఫీస్ వద్ద ప్లాఫ్ తప్పించి వేరే రిమార్క్ లేదు. వరసపెట్టి వెళ్లి పోతున్న తన సినిమాలు చూసి నిట్టూర్చటం తప్ప ఏమీ చేయలేని పరిస్దితి. ఇలా అయితే ఇంకా ఎంతకాలం తన మార్కెట్ ఉంటుందో తెలియని అనిశ్చితి. తెలుగులోనూ ఇదే సిట్యువేషన్.  ఇలాంటి దారుణమైన సమయంలో ఓ బ్లాక్ బస్టర్ సైలెంట్ గా కార్తికు కలిసొచ్చింది. కార్తికు మళ్లీ టైమ్ స్టార్ట్ అయ్యిందనే సిగ్నల్స్ ఇచ్చింది. అదే ఖైదీ చిత్రం.  

ఖైది రిలీజ్ సమయానికి అసలు ఈ సినిమా ఆశలు లేవు. ఓపినింగ్స్ కూడా అంతంత మాత్రమే. మరో ప్రక్క విజయ్ చిత్రం బిగిల్ రిలీజ్ అయ్యి మాస్ హిట్ అనిపించుకుంటోంది. మరో ఫ్లాఫ్ ..కార్తికి అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. కానీ అప్పుడే మిరాకిల్ జరిగింది. మాట్నీ నుంచి జనం పెరిగారు. ఫస్ట్ షో, సెకండ్ షోలు పూర్తయ్యే సరికి సినిమా హిట్ అయ్యిపోయింది.  విభిన్నమైన కథ ఉంటే సినిమాలు ఎగబడి తెలుగు వాళ్లు చూస్తారని మరో మారు ప్రూవ్ అయ్యింది. దాంతో అన్ని చోట్లా  కలెక్షన్స్ వర్షం కురిసింది.

'అల.. వైకుంఠపురములో' టీజర్.. 'సరిలేరు' కంటే తక్కువే!

అందుతున్న ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం తెలుగు రెండు రాష్ట్రాల్లో  ఈ సినిమా 7.5 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాని మూడున్నర కోట్లకు కొన్నారు. దాంతో కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా మంచి లాభాలు వెనకేసారు. ఈ సినిమాతో పాటే రిలీజైన బిగిల్ సినిమా ని చాలా చోట్ల తీసేస్తే ఆ థియోటర్స్ లో  ఖైదీ వేసారు. అంతేకాదు ఈ దర్శకుడుకు విజయ్ పిలిచి మరీ సినిమా ఇచ్చారు. అంతకు మించి సక్సెస్ కు అర్దమేముంటుంది.

దాంతో ఇప్పుడు ఈ కలెక్షన్స్ చూసిన వాళ్లలో కొందరు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారు. వాళ్లెవరు అంటే మొదట ఈ సినిమాని తీసుకోమని ఆఫర్ చేస్తే వద్దన్నవాళ్లు. తాము కార్తి ట్రాక్ రికార్డ్ చూసి ఈ సినిమా వదులుకున్నామని, లేకుండా తాము కూడా ఆ సినిమా ద్వారా సొమ్ము చేసుకుందుము కదా అని గొల్లుమంటున్నారట.
 
ఇక ఈ చిత్ర తెలుగు విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు ముందు ఆయన ‘కల్కి’, ‘బందోబస్త్’, ‘ఎన్జీకే’ సినిమాల రిలీజ్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ఈ రెండు సినిమాలు ఆయనకు నష్టాల్నే మిగిల్చాయి. ఇప్పుడు ‘ఖైదీ’తో ఆయన లాభాలు అందుకుని ఖుషీగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios