కొన్నేళ్లుగా టాలీవుడ్ లో సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరుగుతోంది. ఒకేసారి రెండు, మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిగుతుండడంతో ఆసక్తి పెరిగిపోతోంది. 2020 సంక్రాంతి కూడా పోరుకి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో', మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు ఒక్కరోజు గ్యాప్ తో బాక్సాఫీస్ సందడి చేయబోతున్నాయి.

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. రీసెంట్ గా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రికార్డులను బద్దలు కొడుతూ ఈ టీజర్ యూట్యూబ్ లో ఇరవై మిలియన్ల వ్యూస్ ని రాబట్టింది. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది.

త్రివిక్రమ్ కి దిల్ రాజు దూరం.. మరి పవన్ ఒప్పుకుంటాడా..?

మరికొద్ది రోజుల్లో 'అల.. వైకుంఠపురములో' టీజర్ రాబోతున్నట్లు సమాచారం. నిజానికి మొదట సినిమా టీజర్ అవసరం లేదని అనుకున్నారట. ఎందుకంటే ఇప్పటికే మూడు పాటలతో పాటు టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు దాంతో పాటు చిన్న టీజర్ వదిలారు. దీంతో మరో టీజర్ అవసరం లేదని అనుకున్నారట. 

కానీ ఎప్పుడైతే 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ వచ్చి హడావిడి చేసిందో.. ఇప్పుడు 'అల.. వైకుంఠపురములో' చిత్రబృందం కూడా టీజర్ కట్ వర్క్ మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే ఈ టీజర్ నిమిషంలోపే ఉండొచ్చని అంటున్నారు. సరిలేరు సినిమా టీజర్ నిమిషం మీద 26 సెకన్లు నిడివి వచ్చింది. అయితే 'అల వైకుంఠపురములో' టీజర్ మాత్రం 60 సెకన్ల కంటే తక్కువే ఉండే అవకాశం ఉంది.

ఎలాగో మరో నెల రోజుల్లో ట్రైలర్ రిలీజ్ ఉంటుంది కాబట్టి టీజర్ వీలైనంత చిన్నదే ఉండాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. సినిమా ట్రైలర్ అయితే క్రిస్మస్ సమయంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.