తన అభిమాని మరణాన్ని తట్టుకోలేక తమిళ హీరో కార్తి కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడి భౌతిక కాయాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. దర్శకుడి కావాలనుకొని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తి ఆ తరువాత హీరోగా మారాడు. 

'ఆవారా', 'నా పేరు శివ', 'ఊపిరి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం కార్తి తన వదిన జ్యోతికతో కలిసి 'తంబి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగులో 'దొంగ' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం సత్యం సినిమాస్ లో ఘనంగా జరిగింది.

అమ్మాయిలకు సెక్స్ నచ్చదా..? డైరెక్టర్ హాట్ కామెంట్స్!

అయితే ఈ వేడుకకు హాజరు కావడానికి ముందే కార్తికి తన వీరాభిమాని వ్యాసై నిత్య మరణించాడనే విషయం తెలిసిందే. 'కార్తి మక్కల్ నాలా మండ్రం' పేరిట ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించిన వ్యాసై అంటే కార్తికి ఎంతో అభిమానం. రోడ్డు ప్రమాదంలో అతడు మరణించడంతో కార్తి అతడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

అతడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం 'తంబి' సినిమా ఆడియో లాంచ్ కి హాజరై స్టేజ్ మీద ఈ విషయాన్ని అభిమానులకు తెలిపి మౌనం పాటించాల్సిందిగా కోరారు. కార్తికి తమ అభిమానులతో మంచి ర్యాపో ఉంటుంది. అభిమానుల ఇళ్లలో జరిగే ఈవెంట్స్ కి కూడా కార్తి తరచూ హాజరవుతూ ఉంటారు.  

"