Asianet News TeluguAsianet News Telugu

కార్తీ 'దొంగ' రిజల్ట్ ఏమిటి? 'ఖైదీ' లా కలిసొస్తుందా?

కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్సు అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ.  కార్తీ గత చిత్రం ఖైదీ సూపర్ హిట్ గా నిలవడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి.

Karthi's Donga movie get flop talk
Author
Hyderabad, First Published Dec 21, 2019, 4:01 PM IST

కార్తీకి తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు సినీ ప్రేక్షకు మనసు గెలుచుకున్నారు.ఆయన నటించిన చిత్రాలన్ని తెలుగులోనూ డబ్బింగ్ అవుతూ వచ్చాయి. యుగానికి ఒక్కడు చిత్రంలో పరిచయమై కార్తీ వరస ప్లాఫ్ లతో వెనుకబడి మార్కెట్ పోగొట్టుకున్నాడు. అయితే ఖైదీ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో కాస్త ఒడ్డున పడ్డాడు. దాంతో ఆ ఊపులో మరోసారి తెలుగులో దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

తమిళంలో తంబి చిత్రం తెలుగు అనువాదమే దొంగ‎ చిత్రం. ఈ చిత్రానికి దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ నేపధ్యంలో చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. నిన్న రిలీజైన ఈ చిత్రం ఆ క్రేజ్ ని ఎంత వరకూ నిలబెట్టుకుంది అంటే దాదాపు లేదనే చెప్పాలి. సరైన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలక చతికిలబడ్డ ఈ చిత్రం తమిళంలో యావరేజ్ అనిపించుకుంది. తెలుగులో ఆ టాక్ కూడా రాలేదు.

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

కార్తీ హీరోగా జ్యోతిక, సత్యరాజ్ ప్రధానపాత్రలలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ దొంగ.  కార్తీ గత చిత్రం ఖైదీ సూపర్ హిట్ గా నిలవడంతో దొంగ చిత్రంపై అంచనాలు బాగున్నాయి. అయితే కార్తీ దొంగ, ఆ అంచనాలు  ఏమీ ఉపయోగపడలేదు. ఖైదీతో పోల్చి చూసుకుంటే ఈ చిత్రం తేలిపోయింది. ఫస్ట్ హాఫ్ లో కార్తీ కామెడీ టైమింగ్ తో నవ్వులుపూయిస్తే, ఇంటర్వల్ తర్వాత మొత్తం యాక్షన్ ,ఎమోషన్స్ తో రక్తికట్టిస్తాడు.

అలాగే  ట్రైలర్ చూసి అక్క జ్యోతిక, తమ్ముడు కార్తీల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులు భావిస్తారు. కానీ, సినిమా పూర్తిగా సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ అర్దమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.
 
కథేంటంటే...గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూంటాడు విక్కీ(కార్తీ).మరో ప్రక్క 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతూంటాడు తండ్రి జ్ఞాన మూర్తి(సత్య రాజ్) అక్క పార్వతి(జ్యోతిక). ఈ నేపధ్యంలో ఆ  కుటుంబంలోకి గోవా పోలీస్ అధికారి జీవానంద్(ఇళవరసు) డబ్బుకోసం విక్కీతో కుమ్మకై శర్వాగా అతనిని ప్రవేశ పెడతాడు. శర్వా గా సత్యరాజ్ ఫ్యామిలీలోకి కి వెళ్లిన విక్కీ అక్కడ రకరకాల పరిస్దితులు ఎదుర్కోంటాడు. అవి ఏమిటి...శర్వా ఏమైపోయాడు  అనేది మిగతా కథ.

Follow Us:
Download App:
  • android
  • ios