తెలుగులో ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి సంజనా.. ఆ తరువాత 'సర్దార్ గబ్బర్ సింగ్', 'దండుపాళ్యం' వంటి చిత్రాల్లో నటించింది. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఈ బ్యూటీ బెంగుళూరులోని మెజెస్టిక్ రోడ్ లో కారు నడుపుతూ తీసుకున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.

ప్రమాదకరంగా కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకోవడంపై బెంగుళూరు పోలీసులు ఆమెపై సీరియస్ అయినట్లు.. ఆమెపై కేసు నమోదు చేసిన నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది సంజనా..

పోలీసుల నోటీసులు.. అదంతా ఫేక్ అంటోన్న నటి!

కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె నోటీసులు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు కొంత వ్యవధి కావాలని ఆమె పోలీసులను కోరారు. తను షూటింగ్‌ నిమిత్తం దుబాయ్‌లో ఉన్నానని, వచ్చిన తరువాత హాజరవుతానని విజ్ఞప్తి చేశారు.

ఈ వీడియో ఇంతగా వైరల్ అవుతున్నా.. సంజనా మాత్రం తన సోషల్ మీడియా నుండి దాన్ని తొలగించలేదు. దీన్ని బట్టి ఆమె తను చేసిన పనిని సమర్ధించుకుంటోందనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. మరి పోలీసుల ముందు తన వెర్షన్ ఎలా వినిపిస్తుందో చూడాలి!