తెలుగులో ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటి సంజనా.. ఆ తరువాత 'సర్దార్ గబ్బర్ సింగ్', 'దండుపాళ్యం' వంటి చిత్రాల్లో నటించింది. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఈ బ్యూటీ బెంగుళూరులోని మెజెస్టిక్ రోడ్ లో కారు నడుపుతూ తీసుకున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది.

అది చూసిన పోలీసులు ఆమెని విచారణకి హాజరు కావాలని నోటీసులు పంపినట్లుగా వార్తలు వచ్చాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా చూడడానికి వెళ్లింది సంజన.

ప్రభాస్ హీరోయిన్ సెల్ఫీ వీడియో.. ఫైర్ అయిన పోలీసులు!

అలా వెళ్లే సమయంలో తన ఎగ్జైట్మెంట్ ని అభిమానులతో పంచుకుంటూ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రమాదకరంగా కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకోవడంపై బెంగుళూరు పోలీసులు ఆమెపై సీరియస్ అయినట్లు.. ఆమెపై కేసు నమోదు చేసిన నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన సంజనా ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. తనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పుకొచ్చింది. కావాలనే తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఆమె సెల్ఫీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.