సినీ వరల్డ్ లో కొంతమంది హీరోయిన్స్ ఏ డ్రెస్ వేసుకొచ్చినా ఈవెంట్స్ లో అదే హాట్ టాపిక్ అవుతుంది. పర్సనల్ ఫంక్షన్ అయినా ప్రయివేట్ పార్టీ అయినా సినీ తారలు ఇచ్చే బిల్డప్ మాములుగా ఉండదు. ఇక రీసెంట్ గా కరీనా కపూర్ కూడా అలాంటి బిల్డప్ తో దర్శనమిచ్చింది. ఇటీవల అమ్మడు తన కొడుకు తైమూర్ బర్త్ డే డేను చాలా గ్రాండ్ గా నిర్వహించింది.

వేడుకకి చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు.  అయితే ఇప్పుడు అందుకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొడుకు బర్త్ డే కి పిలిచిన కరీనా అందరి చూపు తన బ్యాగ్ వైపు పడేలా బిల్డప్ ఇచ్చిందట. ఎవరైనా బ్యాగ్ గురించి అడగ్గానే 4లక్షలు పెట్టి ఆ బ్యాగ్ ని కొన్నట్లు అమ్మడు స్పెషల్ గా దాని ప్రత్యేకత గురించి చెప్పినట్లు తెలుస్తోంది.

బోల్డ్ సీన్లకు రెడీ.. 41ఏళ్ల హీరోయిన్ హాట్ కామెంట్స్!

ఈవెంట్ మొదలు నుంచి గెస్ట్ లను పంపించే వరకు.. అ బ్యాగ్ ని వదల్లేదంటే అమ్మడి బిల్డప్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.  ఏదేమైనా కరీనా సొగసులు ఏ మాత్రం చెక్కు చెదరలేదని నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

గత ఏడాది వీరే ధీ వెడ్డింగ్ సినిమాతో హడావుడి చేసిన బేబీ నెక్స్ట్ కూడా అలాంటి డిఫరెంట్ హిట్స్ అందుకునేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో గుడ్ న్యూస్ అనే సినిమా రిలీజ్ కి రెడీగా ఉండగా... మరో రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.