చిత్ర పరిశ్రమలోకి ఎప్పుడూ కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు. వారిలో స్టార్స్ గా ఎదిగేది కొందరు మాత్రమే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న కన్నడ బ్యూటీ అమృత అయ్యర్ యువతని విశేషంగా ఆకర్షిస్తోంది. అందుకు కారణం ఆమె క్యూట్ లుక్స్. ప్రస్తుతం అమృత అయ్యర్ యాంకర్ ప్రదీప్ సరసన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన రెడ్ మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమృత తన సినీ రంగప్రవేశం గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చింది. తాను చాలా సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు అమృత తెలిపింది. మా ఫ్యామిలీలో సినిమాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే. సరదాగా మోడలింగ్ ప్రారంభించా. ఆ సమయంలో ఓ మలయాళీ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. 

ఒకటి రెండు చిత్రాలు చేసి మానేద్దాం అనే ఆలోచన ఉండేది. అప్పుడే బిగిల్ లో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సూపర్ హిట్.. దీనితో ప్రస్తుతం మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. నాకు మంచి అవకాశాలు వస్తుండడంతో నా ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పడం లేదు. ప్రోత్సహిస్తున్నారు అని అమృత తెలిపింది. 

పొలిటీషియన్ తో చేతులు కలిపిన అల్లు అర్జున్.. ఎవరూ ఊహించని బిజినెస్

ఇక సినిమాల్లో గ్లామర్ గా కనిపించడం గురించి అమృత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇది గ్లామర్ ఫీల్డ్ అనే విషయం తెలిసే వచ్చాయి. అందంగా కనిపించడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ మితిమీరిన అందాల ప్రదర్శన అంటే నావల్ల కాదు. నాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. వాటిని ఎప్పుడూ అతిక్రమించను అని అమృత తేల్చి చెప్పేసింది.