స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ గత చిత్రాల కంటే ఈ మూవీ భిన్నంగా ఉండబోతోంది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. 

ఇదిలా ఉండగా బన్నీ తండ్రి అల్లు అరవింద్ కేవలం నిర్మాతగా మాత్రమే కాక పలు వ్యాపారాలు చూసుకుంటున్నారు. బన్నీ కూడా నెమ్మదిగా వ్యాపారాల్లో కూడా రాణించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలంతా వ్యాపారాల్లో కూడా రాణిస్తున్నారు. 

కాగా అల్లు అర్జున్ ఎంచుకున్న బిజినెస్ మాత్రం విభిన్నమైనది. ఖరీదైన కార్లని అద్దెకు ఇచ్చే సంస్థలో అల్లు అర్జున్ భాగస్వామిగా చేరబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రాజకీయ నాయకుడు నిర్వహిస్తున్న ఈ సంస్థలో అల్లు అర్జున్ 7 శాతం వరకు వాటా పొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బోర్ కొడితే.. ఇంట్లో ఇలా హార్స్‌ రైడింగ్ చేయండి: పూరి జగన్నాథ్

వివిధ శుభకార్యాలకు బడా సెలెబ్రిటీలంతా వివిధ ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. అలాంటి వారికోసం అద్దెకు కార్లని అందించే వ్యాపారం ఇది. టాలీవుడ్ లో విశేషంగా అభిమానుల ఆదరణ పొందుతున్న బన్నీ తనకు ఏమాత్రం సంబంధం లేని కొత్త బిజినెస్ ని ఎంపిక చేసుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.