కన్నడ స్టార్ హీరోరాకింగ్ స్టార్ యష్ మరోసారి ఇండియన్ ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేశాడు. KGF ఛాప్టర్ 1 తో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ హీరో నెక్స్ట్ కూడా అదే స్టైల్ లో హిట్టందుకోవడానికి సిద్దమవుతున్నాడు. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పోస్టర్స్ తో ఇప్పుడే సినిమా హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నాడు.

మొన్న సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని వదిలిన చిత్ర యూనిట్ ఇప్పుడు యష్ బర్త్ డే సందర్బంగా మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ తోనే యష్ సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాడు. అన్ని వర్గాల ఆడియెన్స్ కి ఈ కన్నడ హీరో ఇంకా దగ్గరవుతున్నట్లు ఈజీగా అర్ధమవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ట్రైలర్ తో బిల్డప్ ఇచ్చే సినిమాలు పెద్దగా ప్రభావం చూపవని ఓ వర్గం నుంచి వచ్చే కామెంట్ కి KGF సినిమా ఒక ప్రత్యేక ఉదాహరణ. సినిమా విడుదలకు ముందు నలు వైపులా తెలుగు హిందీ అని తేడా లేకుండా ప్రమోషన్స్ చేసి మరి  పాన్ ఇండియాల్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఒక కన్నడ సినిమాకి అంత సీన్ ఉందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ విమర్శకుల నోళ్లు మూయించి రివ్యూలకు  సైతం దిమ్మ తిరిగేలా వసూళ్లు అందుకుంది KGF ఛాప్టర్ 1.

ఇక రెండు వందల కోట్ల కలెక్షన్స్ తో నేషనల్ వైడ్ గా కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF హీరో యాష్ మరో ఆయుధాన్ని రెడీ చేస్తున్నాడు. KGF ఛాప్టర్ 2 బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండడంతో అంచనాలను ఆకాశాన్ని దాటేశాయి.  ఒక్క కన్నడలోనే కాకుండా తమిళ్ తెలుగు హిందీ భాషల్లో ఎంతో మంది అభిమానులు ఈ సెకండ్ చాఫ్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.

'అల వైకుంఠపురములో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

ఇక ఫస్ట్ లుక్ లో యష్ తన మాస్ స్టైల్ తో అదరగొట్టేశాడు. మొదటి పార్ట్ హిట్టవ్వడంతో అంతకంటే ఎక్కువ బడ్జెట్ తో సెకండ్ పార్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.