ఒక కన్నడ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా సత్తా చాటగలవని KGF 1 నిరూపించిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజైన ఈ సినిమా మొదటి పార్ట్ సంచలనం సృష్టించింది. సినిమాకు వచ్చిన కలెక్షన్స్ కి బాలీవుడ్ సైతం బిత్తరపోయింది. KGF 1 ప్రమోషన్స్ డోస్ పెంచి ఉంటే ఇంకాస్థ ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ఉండేవి.

read also చంటి నుంచి F2 వరకు.. వెంకటేష్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

అలాగే థియేటర్స్ సంఖ్య కూడా పెంచి ఉంటే కూడా సినిమా సరికొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలుకొట్టేది. ఇకపోతే ఇప్పుడు KGF ఛాప్టర్ 2 తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులలో కన్నడ సినిమాని ఉంచేలా చిత్ర యూనిట్ స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కన్నడ సినిమా చరిత్ర క్రియేట్ చేయాలనీ కథానాయకుడు యాష్ రెడీ అవుతున్నాడు.

సినిమాకు సంబందించిన అసలైన ప్రమోషన్స్ డోస్ కూడా పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. డిసెంబర్ 21న సాయంత్రం 5:45గంటలకు సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక సంజయ్ దత్ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా పోస్టర్స్ ని అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా రెడీ చేస్తున్నారు. ముఖ్యగా బాలీవుడ్ లో సంజయ్ ద్వారా ప్రమోషన్స్ డోస్ పెంచేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా KGF 1 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో సెకండ్ పార్ట్ పై అంచనాల డోస్ తారా స్థాయికి చేరింది. తప్పకుండా సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. బాక్స్ ఆఫీస్ కి ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఎండింగ్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటున్నారు, కానీ ఇటీవల షూటింగ్ కి నెలరోజుల పాటు బ్రేక్ పడటంతో సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది.