కన్నడ నటి విజయలక్ష్మి 'తుంగభద్ర' సినిమాలో నటిస్తోన్న సమయంలో ఆ చిత్ర సహాయ దర్శకుడితో ప్రేమలో పడింది. గత నెల 15న అతడితో కలిసి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మీ తల్లి, అమ్మమ్మ విషం తాగారు. విజయలక్ష్మి అమ్మమ్మ మరణించగా.. ఆమె తల్లి చికిత్స పొందుతున్నారు.

సినీ నిర్మాత నుండి డబ్బులు తీసుకొని విజయలక్ష్మి వెళ్లిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె రాయచూరులో ప్రత్యక్షమయ్యారు. ఆమె భర్త అంజినేయతో కలిసి రాయచూరులో మీడియాతో మాట్లాడారు. 'తుంగభద్ర' సినిమా షూటింగ్ సమయంలో సహాయ డైరెక్టర్ ఆంజినేయని ప్రేమించానని తెలిపారు.

డైరెక్టర్ తో లేచిపోయిన నటి.. తల్లి ఆత్మహత్యాయత్నం!

ఆంజినేయ, తాను గంగావతిలో పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఇది నచ్చక తన అమ్మమ్మ, అమ్మ విషం తాగి ఆత్యమహత్యాయత్నం చేశారని వార్తలు వచ్చాయన్నారు. తమ అమ్మమ్మ చనిపోలేదని, తన తల్లి డ్రామాలాడుతోందని మండిపడ్డారు. తన తల్లితండ్రులు విడిపోయి ఆరేళ్లు అవుతోందని.. తల్లి, పెంచిన తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేకపోయానని అన్నారు.

తన భర్తని చంపడానికి కూడా వారు కుట్ర చేశారని ఆమె ఆరోపించారు. తాను రాయచూరుకి వస్తున్న సమయంలో తాను ఎవరి వద్ద డబ్బు, బంగారు తీసుకోలేదని, తమ పెద్దలకు డబ్బు సంపాదించి పెట్టాలి తప్ప.. తాను పెళ్లి చేసుకోకూడదని వారు చెప్పినట్లు ఆవేదన వ్యక్తం చెందారు. జిల్లా ఎస్పీ వేదమూర్తిని కలిసి తమకి రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపింది.