బేబీ డాల్ ఫేమ్ సింగర్ కనికా కపూర్ లండన్ నుంచి వచ్చి అందరిని టెన్షన్ కు గురిచేసింది. కరోనా ఇండియాలో వ్యాప్తి చెందుతున్న సమయంలో కనికా కపూర్ లండన్ నుంచి ఇండియాకు వచ్చింది. క్వారంటైన్ లో ఉండకుండా ఇష్టం వచ్చినట్లు పార్టీలు పబ్బులు అంటూ తిరిగింది. 

చివరకు కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెతో కలసి పార్టీ చేసుకున్న వారంతా కరోనా భయంతో వణికిపోయారు. గత కొన్ని వారాలుగా కనికా కపూర్ లక్నోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. డాక్టర్లు కనికా కపూర్ కు వైద్యం అందిచినప్పటికీ ఐదు సార్లు కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ గానే వస్తూ వచ్చింది. 

నో..నో.. తమ్ముడు అడిగితే వదులుకుంటా: చిరంజీవి

దీనితో ఆమె ఆరోగ్యంపై కాస్త ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఎట్టకేలకు బయటపడింది. ఆరవ సారి పరీక్షా నిర్వహించగా కనికా కపూర్ కు నెగిటివ్ అని తేలింది. దీనితో కనికా కపూర్ ఆరోగ్యం కుదుట పడ్డట్లైంది. దీనితో కనికా కపూర్ ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. 

అయినప్పటికీ వైద్యులు కనికా కపూర్ కు రెండు వారల పాటు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ సూచించారు. మొత్తంగా కనికా కపూర్ కోలుకుని ఇంటికి తిరిగి వస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషంతో ఉన్నారు.