మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. కరోనా ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తుండడంతో ఇండియాలో కూడా సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా ప్రభావం లేకుంటే ఈ సమయానికి ఆచార్య ఫస్ట్ లుక్ విడుదలయ్యేది. 

ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ తదుపరి చిత్రాల గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫెర్ రీమేక్ హక్కులని మెగాస్టార్ చిరంజీవి దక్కించుకున్నారు. ఆచార్య తర్వాత చిరు నటించే చిత్రం అదే అనే ప్రచారం జరుగుతోంది. 

ప్రముఖ నటి అపార్ట్మెంట్ మూసేసిన అధికారులు.. కారణం ఇదే!

అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లూసిఫెర్ రీమేక్ పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. లూసిఫెర్ రీమేక్ లో పవన్ నటిస్తారా అనే ప్రశ్నకు బదులిస్తూ.. నో నో ఆ సినిమా నేనే చేస్తా.. ఒక వేళ తమ్ముడు ఆ చిత్రం కోసం ఉత్సాహం చూస్తే వదులుకోవడానికి రెడీ. అయితే పవన్ ఈ చిత్రం కోసం ఆసక్తి చూపుతున్నట్లు నా వరకైతే సమాచారం రాలేదు అని చిరు తెలిపారు. 

ఇక ఆచార్య తర్వాత చేయబోయే చిత్రం గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం నలుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని.. ఇంకా నిర్ణయించుకోలేదని చిరు తెలిపారు.