ఇండియాలో కరోనా వ్యాప్తి చెందిన తర్వాత అందరికంటే ఎక్కువగా గాయని కనికా కపూర్ నిందలపాలైంది. గత నెలలో కనికాకపూర్ కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. కనికాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెపై సానుభూతి కలగకపోగా.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కనికా వైఖరే కారణం. 

మార్చి 10న కనికా కపూర్ లండన్ నుంచి వైరస్ అంటించుకుని ఇండియాకు వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. అయినా కూడా కనికా కపూర్ లెక్క చేయకుండా లక్నోకి వెళ్లి పార్టీలో పాల్గొంది. మార్చి 20న ఆ ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. 

అనంతరం చికిత్స తీసుకుని కోలుకుంది. ప్రస్తుతం కనికా కపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి లక్నోలోని తన నివాసంలో క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవల ఆమె తన ఇంటి నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వ సూచనల్ని ఆమె పాటించడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నాని హీరోయిన్.. నితిన్ తో కలసి బోల్డ్ సీన్లకు రెడీ ?

దీనిపై తాజాగా కనికా కపూర్ సోషల్ మీడియాలో స్పందించింది. తానెక్కడికి పారిపోలేదని ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నానని స్పష్టం చేసింది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో వాస్తవం లేదని కనికా పేర్కొంది. లండన్ నుంచి వచ్చినప్పుడు కూడా తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని.. అందువల్లే తన ఫ్యామిలీని చూసేందుకు ముంబై నుంచి లక్నో వెళ్లినట్లు కనికా వివరణ ఇచ్చింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Stay Home Stay Safe 🙏🏼

A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on Apr 26, 2020 at 1:50am PDT