Asianet News TeluguAsianet News Telugu

షాక్: దిల్ రాజుని కంగనా ర‌నౌత్ పెద్ద దెబ్బకొట్టింది!

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వస్తున్న  కంగ‌నా ర‌నౌత్ తాజాగా పంగా అనే చిత్రం చేస్తోంది.  ‘కలను నిజం చేసుకోవడానికి ప్రతి తల్లికి రెండో అవకాశం ఇవ్వాలి’  అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.

Kangana's Panga movie similar to Jersey
Author
Hyderabad, First Published Dec 26, 2019, 11:33 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్‌లో తెలుగు సినిమా రీమేక్‌లకు ఆదరణ రోజురోజుకీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. ‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌ సింగ్‌’ దాదాపు రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టడంతో అక్కడ నిర్మాతల దృష్టి ఇక్కడ సినిమాలపై మరింతగా పడేలా చేస్తోంది.  ఈ నేపధ్యంలో తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘జెర్సీ’ సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలుగులో డైరక్ట్ చేసిన గౌతమ్ తిన్నసూరి హిందీలో కూడా మెగా ఫోన్ పడుతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.  ఇందుకోసం కరణ్‌ జోహార్‌ తో కలిసి ఈ ప్రాజెక్టుని వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఇక్కడే ట్విస్ట్ పడింది. కంగనా రనత్ రూపంలో సమస్య వచ్చి పడింది.

ఫ్యాన్స్ తో ఫోటోలు దిగడానికి మహేష్ డబ్బులు తీసుకున్నాడా..?

కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వస్తున్న  కంగ‌నా ర‌నౌత్ తాజాగా పంగా అనే చిత్రం చేస్తోంది.  ‘కలను నిజం చేసుకోవడానికి ప్రతి తల్లికి రెండో అవకాశం ఇవ్వాలి’  అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. రీసెంట్ గా ట్రైలర్ సైతం రిలీజ్ అయ్యింది.

ట్రైలర్ లో కంగనా గృహిణిగా, పిల్లల తల్లిగా, రైల్వే ఉద్యోగిగా కనిపిస్తోంది. కబడ్డీ ఛాంపియన్‌ అయిన మధ్యతరగతి అమ్మాయి కంగన తనకు ఇష్టమైన ఆటను మధ్యలో వదిలేయాల్సి వస్తుంది. వివాహం చేసుకున్న తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చారు. 32 ఏళ్ల వయసులో మళ్లీ కబడ్డీలో రాణించాలని ఆశిస్తారు. ఎంతో శ్రమించి భారత జట్టుకు ఎంపిక అవుతారు. ఈ కథాంశంతో.. ‘ప్లేయర్స్‌ విశ్రాంతి తీసుకునే వయసులో ఆమె తిరిగొచ్చారు..’ అంటూ ఆసక్తికరంగా ఈ ట్రైలర్‌ను రూపొందించారు.

ఈ ట్రైలర్ చూసిన వారంతా జెర్సీ హిందీ వెర్షన్ చూసినట్లు ఫీలవుతున్నారు. కేవలం తెలుగులో హీరో చేసిన పాత్రను హిందీలో హీరోయిన్ కు, క్రికెట్ కు బదులు కబడ్డీ  మార్చారని అర్దమవుతోంది. ఇదే కనుక స్క్రిప్టు మొత్తం చేసి ఉంటే... దిల్ రాజు కు పెద్ద దెబ్బే .దాదాపు అలాంటి పాయింట్ తోనే సినిమా వచ్చాక..జెర్సీ రీమేక్ చేస్తే క్రేజ్ ఏముంటుంది. ఎవరు చూస్తారు.

ఈ సినిమాకు ‘బరేలీ కీ బర్ఫీ ఫేమ్‌’ అశ్వనీ అయ్యర్‌ తివారీ దర్శకత్వం వ‌హిస్తున్నారు . నీనా గుప్తా, జెస్సీ గిల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు . చిత్రంలో కంగ‌నా రనౌత్‌ భర్తగా జెస్సీ గిల్‌ కనిపిస్తారట. ఈ  చిత్రంలో త‌న పాత్ర‌కి పూర్తి న్యాయం చేసేందుకు ఓ కోచ్ స‌మ‌క్షంలో కంగనా కోచింగ్ కూడా తీసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios