బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఇండియాలోనే క్రేజీ హీరోయిన్. కంగనా రనౌత్ బాలీవుడ్ లో ధైర్యానికి మారుపేరుగా మారిపోయింది. ఎంతటి వారినైనా ఎదిరించడం.. ఎలాంటి విషయం గురించి అయినా బెదురు లేకుండా మాట్లాడడం లాంటి లక్షణాలతో కంగన రనౌత్ ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేయించుకుంది. 

ఇక కంగనపై వచ్చే విమర్శలని తిప్పి కొడుతూ ఆమె సోదరి రంగోలి కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఓ సంధర్భంలో బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కంగానని బెదిరించిన విషయాన్ని రంగోలి బయట పెట్టింది. 

ఓ ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్, మహేష్ భట్ ప్రధాని నరేంద్ర మోడీని నియంత అని విమర్శించారు. ఆవ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందించాడు. మోడీ సర్.. మిమ్మల్ని ఎవరో ఒకరు ప్రతి రోజు నియంత అని విమర్శిస్తూనే ఉన్నారు. అసలైన నియంత ఎలా ఉంటాడో వీళ్లకు ఒకసారి చూపించండి అని సదరు నెటిజన్ ట్వీట్ చేశాడు. 

షాకింగ్ ట్విస్ట్.. అసలు 'భీష్మ' నితిన్ కాదు.. మరెవరు?

దీనిపై రంగోలి స్పందించింది. ఒకసారి కంగనని జావేద్ అక్తర్ ఇంటికి పిలిపించుకున్నాడు. హృతిక్ రోషన్ కు సారీ చెప్పకపోతే ఊరుకోను అని బెదిరించాడు. ఇక మహేష్ భట్ పైన కూడా రంగోలి విమర్శలు గుప్పించారు. సూసైడ్ బాంబర్ గా నటించనున్నందుకు మహేష్ భట్ కంగనపై చెప్పులు విసిరాడు. ఇలాంటి వాళ్లంతా ప్రధాని నరేంద్ర మోడీని నియంత అని విమర్శిస్తున్నారు. మీకు ఏమైంది అని రంగోలి ట్వీట్ చేసింది. 

గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. షాకిస్తోన్న 'ఇడియట్' హీరోయిన్!