బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్ తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. 19 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవారు. పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న రోల్ వచ్చినా కంగనా నటించేవారు.

అలాంటిది ఈరోజు ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో కంగనా కూడా ఒకరు. అయితే కెరీర్ ఆరంభంలో మాత్రం ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

నన్ను రేప్ చేశారు.. కమెడియన్ రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తనకు 19 సంవత్సరాలని.. అప్పుడే తన అక్కడ రంగోలీపై యాసిడ్ ఎటాక్ జరిగిందని.. ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నామని చెప్పింది. మధ్యతరగతి కుటుంబం కావడంతో అక్క ట్రీట్మెంట్ కి చేతిలో డబ్బులు కూడా లేవని.. తనకు సరైన చికిత్స చేయించాలని కొన్ని చెత్త సినిమాల్లో కూడా నటించానని చెప్పుకొచ్చింది.

గెస్ట్ రోల్స్ లో నటించడానికి కూడా వెనుకాడలేదని.. అలా వచ్చిన డబ్బుతో అక్కకి 54 సర్జరీలు చేయించానని చెప్పారు. ఆ సమయంలో తన వయసున్న అమ్మాయిలూ జుట్టు సరిగ్గా లేదని, ఫుడ్ బాలేదని ఇలాంటి విషయాలతో బాధపడేవారని.. కానీ తను మాత్రం ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది. చాలా మంది తన చేతకానితనాన్ని వాడుకున్నారని.. తల్లి తండ్రులకు ఏమీ చెప్పుకోలేనని లైంగికంగా వేధించారని గుర్తు చేసుకుంది.

ఒక మనిషి ఎంత నరకం అనుభవిస్తాడో.. అవన్నీ తను అనుభవించినట్లు.. ఈ సంఘటనలన్నీ తనను స్ట్రాంగ్ గా మార్చాయని చెప్పుకొచ్చింది. తన పిల్లలకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని.. వారికి మెరుగైన భవిష్యత్తు అందిస్తానని చెప్పారు.

ప్రస్తుతం కంగనా నటించిన 'పంగా' అనే సినిమా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అశ్వినీ అయ్యర్ తివారీ నటించిన ఈ సినిమాలో కంగనా కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు.