'సైన్మా' అనే షార్ట్ ఫిల్మ్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ ఆ తరువాత కమెడియన్ గా మారి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అతడు నటించిన చాలా సినిమాలు సక్సెస్ అయ్యాయి. 'అర్జున్ రెడ్డి' సినిమాతో రాహుల్ రామకృష్ణకి జనాల్లో గుర్తింపు వచ్చింది.

ఈ సినిమా తరువాత రాహుల్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే మాట్లాడే రాహుల్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనపై చిన్నప్పుడు రేప్ జరిగిందని.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

ఈ స్టార్ దర్శకులు.. గురువులను మించిన శిష్యులు!

తనను చిన్నప్పుడు రేప్ చేశారని.. ఆ బాధని ఎవరితో ఎక్కడ పంచుకోవాలో తెలియలేదని.. అందుకే ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేద్దామని అనుకున్నట్లు తెలిపారు. ఇలా ఇతరులతో ఈ విషయాన్ని పంచుకోవడం ద్వారానే నేనేంటో తెలుసుకోగలుగుతున్నానని.. ప్రతీదీ బాధగానే ఉంటుందని చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న అతడి అభిమానులు షాక్ అవుతున్నారు. స్క్రీన్ మీద అందరినీ నవ్వించే అతడి జీవితంలో ఇలాంటి చేదు ఘటన జరిగిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. అతడికి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో రాహుల్ రామకృష్ణ ఓ పాత్రలో కనిపించారు.