Asianet News TeluguAsianet News Telugu

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ  నెల 29న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ....800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. 

kamma rajyamlo kadapa redlu movie release date fixed
Author
Hyderabad, First Published Nov 23, 2019, 2:35 PM IST

రామ్ గోపాల్ వర్మ తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని ఈ  నెల 29న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

ఆ హీరోని చూస్తూ హస్తప్రయోగం చేసుకునేవాడ్ని.. కమెడియన్ వ్యాఖ్యలు!

ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియచేస్తూ....800 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్స్ కు, సాంగ్స్ కు,విశేషమైన ఆదరణ లభించిందని తెలిపింది. అలాగే పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో ట్రెండింగ్ అయ్యిందని  చిత్రబృందం వెల్లడించింది.

ఏ వర్గాలను టార్గెట్ చేసి ఈ చిత్రం తీయలేదని...ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిదని స్ప్రష్టం చేసింది. ఇందులోని  ఏడు పాటలు ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుందని వివరించింది. టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, నిర్మాతలు: అజయ్ మైసూర్, టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్.

 

Follow Us:
Download App:
  • android
  • ios