ఒలంపిక్స్ లో ఇండియా చరిత్ర అంతంత మాత్రంగానే ఉంది. పరుగుల వీరుడిగా పేరుగాంచిన ఉసేన్ బోల్ట్ ని అధికమించే వీరులు భవిష్యత్తులో రావచ్చు. కానీ ఒలింపిక్స్ లో రికార్డ్ దృష్ట్యా ఆ ఆశ ఇండియన్ క్రీడాభిమానులకు ఉండకపోవచ్చు. కానీ కర్ణాటకలో జరిగే కంబళ పోటీల్లో ఉసేన్ బోల్డ్ ని మించే వీరుడు వెలుగులోకి వచ్చాడు. 

దున్నపోతులతో కలసి 142.4 మీటర్ల దూరం పరుగును 13.42 సెకన్లలో పూర్తి చేశాడు. అతడే శ్రీనివాస గౌడ. ప్రస్తుతం దేశం మొత్తం ఇతడి గురించే చర్చించుకుంటోంది. శ్రీనివాస గౌడని ఒలింపిక్స్ కి పంపే ఆలోచనలో కూడా భారత ఒలంపిక్ సంఘం ఉంది. ఇంతలా సంచలనం సృష్టిస్తున్న కంబళ పోటీలపై త్వరలో సినిమా తెరకెక్కబోతోంది. 

కర్ణాటకలోని ఓ నిర్మాత 'కంబళ' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. కంబళ పోటీలపై ఉన్న క్రేజ్, ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీని గురించి జరుగుతున్న చర్చని ఉపయోగించుకునేందుకు సదరు నిర్మాత ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.  

లైంగిక వేధింపుల కేసులో అమలాపాల్ కు షాక్!

ఇదిలా ఉండగా కంబళ పరుగు వీరుడు శ్రీనివాస గౌడని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సత్కరించారు. కర్ణాటన క్రీడల శాఖ శ్రీనివాస గౌడకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం కూడా చేశారు.