సౌత్ హీరోయిన్ అమలాపాల్ ని అనేక వివాదాలు వెంటాడుతున్నాయి. అయినప్పటికీ అమలాపాల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తోంది. ఎలాంటి విషయం గురించి అయినా అమలాపాల్ ధైర్యంగా మాట్లాడేస్తుంది. సౌత్ లో ఎదురవుతున్న లైంగిక వేధింపులపై అమలాపాల్ పలు సందర్భాల్లో స్పందించింది. 

2018లో అమలాపాల్.. భాస్కరన్ అనే వ్యక్తిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. చెన్నైలోకి  కొరియోగ్రాఫర్ శ్రీధర్ కు చెందిన స్టూడియోలో అమలాపాల్ డాన్స్ రిహార్సల్స్ లో ఉండగా ఆమెని అలగేషన్ అనే వ్యక్తి సంప్రదించాడు. సెక్సువల్ ఫేవర్ కోసం అతడు అమలాపాల్ ని కలిశాడు. ఆమెని ఒప్పించేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చేందుకు కూడా ప్రయత్నించాడు. 

దీనితో అమలాపాల్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేయడమే కాదు.. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసింది. దీనితో పోలీసులు అలగేషన్ ని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో తాను భాస్కరన్ అనే వ్యాపారవేత్త పంపితే వచ్చానని.. అతడి కోసమే అమలాపాల్ తో మాట్లాడానని వివరించాడు. దీనితో పోలీసులు భాస్కరన్ పై కూడా కేసు నమోదు చేశారు. 

నితిన్ 'భీష్మ' సూపర్ అంటూ త్రివిక్రమ్ రివ్యూ.. నమ్మొచ్చా!

భాస్కరన్ మాత్రం తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసుకు వ్యతిరేకంగా కోర్టుని ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో చెన్నై హై కోర్టు భాస్కరన్ కు అనుకూలంగా స్టే ఇచ్చింది. అమలాపాల్ చివరగా ఆమె అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో అమలాపాల్ ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించి సంచలనం సృష్టించింది.