పెద్ద సినిమాలకు లీక్ అనేది పెద్ద సమస్యగా మారింది. సినిమా రిలీజ్ అయ్యాక ...కలెక్షన్స్ కు గండి కొడుతూ రిలీజ్ రోజే ఆన్ లైన్ లో  ప్రింట్స్ బయిటకు వచ్చేయటం ఓ దెబ్బ అయితే, సినిమా షూటింగ్ దశలోనే ఆన్ లొకేషన్ నుంచి స్టిల్స్ లీక్ అవటం మరో సమస్య. ఈ లీక్ ల వల్ల ప్రాజెక్టుకు చేసే ప్రమోషన్స్ విషయంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంది.

తాము అఫీషియల్ గా రిలీజ్ చేద్దామనుకున్న లుక్ బయిటకు వచ్చేస్తే దర్శక,నిర్మాతలు ఏం చెయ్యగలరు. ప్రి పబ్లిసిటీ అని సరిపెట్టుకోవటం తప్ప. ఇప్పుడు కమల్ హాసన్ తాజా చిత్రం భారతీయుడు 2 కు ఈ లీక్ ల సమస్య ఎదురైంది. ప్రస్తుతం భూపాల్ షెడ్యుల్ లో ఉన్న భారతీయుడు 2 చిత్రం యూనిట్ లీక్ ఫొటోల సమస్యను ఎదుర్కొంటోంది. అప్పటికీ శంకర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ఈ లీక్ ల ప్రవాహం ఆగలేదు..

నరేష్ పై రెచ్చిపోయిన హేమ.. జీవిత మేడంకు హక్కు లేదా!

ఈ సినిమాలో కమల్ లుక్ ని సస్పెన్స్ గా ఉంచి, ట్రైలర్ , ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేద్దామనుకున్నారు. కానీ రెండు రకాల ఫొటోలు బయిటకు వచ్చాయి. ఓ ఫొటోలో కమల్ కు మేకప్ మేన్ ఫైనల్ టచ్ ఇస్తున్నారు. మరొక ఫొటోలో కమల్ ...ఓ గుర్రం ఎక్కి వెళ్తన్నారు. ఈ ఫొటో చూస్తే..గతంలో భారతీయుడు గెటప్ కన్నా ముసలి గెటప్ లా ఉండటం గమనించవచ్చు.

ఇక కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను ఎప్పటి నుండో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు... చివరికి సినిమాను ఘనంగా ప్రారంభించి.. మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసే క్రమంలో కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి మధ్యలోనే బ్రేక్ ఇచ్చారు.

ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ..రకరకాల కారణాలతో  షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. అయితే ఆ సమస్యలను పరిష్కరించుకుని ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టారు. శంక‌ర్ ఈ సినిమాను బ‌డ్జెట్ లిమిట్స్ లేకుండా మ‌రో పెద్ద బ్యాన‌ర్‌లో చేయాల‌ని చాల ప్రయత్నించారు. కానీ అది సెట్ కాలేదు.