సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మహర్షి విజయం తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఇదే. 

విశ్వ నటుడు కమల్ హాసన్ నేడు (నవంబర్ 7,గురువారం) 65వ జన్మదినం జరుపుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ భారదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసి నటించడం ఆయనకు అలవాటు. కమల్ హాసన్ కెరీర్ లో ఆయన నటనని చాటి చెప్పే సాగరసంగమం, భారతీయుడు, దశావతారం లాంటి ఎన్నో చిత్రాలు ఉన్నాయి. 

దశావతారం చిత్రంలో ఏకంగా 10 పాత్రలు పోషించి ఔరా అనిపించారు. కమల్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. కమల్ హాసన్ సర్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఇండియన్ సినిమాకు మీరు 60 ఏళ్లుగా అసాధారణమైన సేవలు చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. మీరు మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. 

కమల్ హాసన్ 1960లో తన ఐదవ ఏటనే బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మహానటి సావిత్రి, జెమినీ గణేశన్ నటించిన కలతూర్ కన్నమ్మ చిత్రంలో కమల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు. అప్పటి నుంచి 60 ఏళ్లుగా కమల్ నట జీవితం దిగ్విజయంగా కొనసాగుతోంది.