అవును...తమ సినిమాలో కాజల్ పాత్ర చూస్తే ప్రతీ ఒక్కరికీ అదే ఫీలింగ్ వస్తుందని చెప్తున్నారట ఇండియన్ 2 చిత్రం టీమ్. స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న కాజల్ ...తాజాగా భారతీయుడు2 సినిమాలో కీ రోల్ చేస్తోంది. కమల్ హాసన్ సరసన చేస్తున్న ఆమె పాత్ర నెగిటివ్ టచ్ తో సాగుతుందని తెలుస్తోంది. కమల్ కు ఆమె చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. ఈ పాత్రను అసలు ఎవరూ ఊహించలేని విధంగా డిజన్ చేసారని చెప్తున్నారు. ఆమెకు 85 సంవత్సరాలు ఉంటాయి కానీ ఆమె దుర్మార్గురాలిగా కనిపించబోతోందని చెప్తున్నారు.

ఇక  సినిమా కోసం కాజల్‌ వర్మ కళ అనే విద్యను నేర్చుకున్నారట. ఈ విషయాన్ని కోలీవుడ్‌ చిత్ర వర్గాలు వెల్లడించాయి. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది.ఈ చిత్రాన్ని తమిళ న్యూ ఇయిర్ సందర్బంగా  ఏప్రియల్ 14, 2021న రిలీజ్ చేయబోతున్నారు.

కెమెరామెన్ పై మండిపడ్డ బాలయ్య, న్యాయమేనా?

అప్పట్లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘భారతీయుడు’.అవినీతికి లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసిన పోరాటం ప్రజలను ఎంతగానో మెప్పించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంంలో  ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మరోసారి కమల్, శంకర్ ముందుకొచ్చారు.

గత సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పస్ట్‌లుక్‌ను చిత్రబృందం వదిలింది. ఈ ఫస్ట్‌లుక్ చూస్తే భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్ర మన కళ్లదెరుగా కనపడుతుంది.అయితే అనుకున్న విధంగా షూటింగ్ మొదలు కాలేదు.