బాలయ్య రీసెంట్ చిత్రం రూలర్ ...మరో చర్చ అంటూ  డిజాస్టర్ గా తొలిరోజే డిక్లేర్ అయిన సంగతి తెలిసిందే. పెట్టిన పెట్టుబడిలో ఇరవై ఐదు శాతం కూడా రికవరీ అవ్వటం కష్టమైంది.అంతేకాదు అభిమానులు సైతం ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపించారు. అవుట్ డేటెడ్ ప్లాట్, భరించలేని నటన, దారుణమైన స్క్రీన్ ప్లే ..సినిమాని చూడలేని విధంగా రెడీ చేసాయి. ముఖ్యంగా ఇన్సపెక్టర్ ధర్మాగా బాలయ్య చాలా ఫన్నీగా కనిపించారు. ఓ గమ్మత్తైన విగ్గు, మీసం, మేకప్ ..సినిమాని అత్య దిశకు తీసుకెళ్లిపోయాయి. అయితే ఈ విషయమై బాలయ్య ...సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ పై మండిపడుతున్నట్లు సమాచారం.

బ్లేమ్ మొత్తం తనను బాగా చూపించలేదని రామ్ ప్రసాద్ పై బాలయ్య వేసారని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో వాడిన విగ్గులన్నీ బాలయ్య ఎంచుకున్నవే అలాగే మేకప్ కూడా తనకు కావాల్సన గెటప్ ని ఎంచుకుని వేయించుకున్నారు. అయితే ఇప్పుడు తనని సరిగ్గా చూపించకపోవటంతోనే అన్ని విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చిందని బాలయ్య సినిమాటోగ్రాఫర్ ని టార్గెట్ చేయటం చాలా ఆశ్చర్యం అంటున్నారు. మొదట తన తదుపరి చిత్రానికి సైతం రామ్ ప్రసాద్ నే సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్న బాలయ్య ..ఇప్పుడు అతను వద్దు అని చెప్పేసారట. బోయపాటితో చేస్తున్న సినిమాకు ఇప్పుడే వేరే కెమెరామెన్ ని వెతికే పనిలో టీమ్ ఉందని సమాచారం.

స్టేజ్ పై ఏడ్చేసిన రోజా.. వైరల్ అవుతోన్న వీడియో!
 
నందమూరి బాలకృష్ణ హీరోగా వెట‌రన్ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రూలర్‌. సోనాల్ చౌహాన్‌, వేదిక లాంటి అందాల భామ‌లు న‌టించిన ఈ చిత్రాన్ని కేఎస్.ర‌వికుమార్ లాంటి మాస్ డైరెక్ట‌ర్ దర్శకత్వంలో చేసారు.  క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే రిలీజ్ అయ్యాక పరిస్దితి రివర్స్ అయ్యింది. పూర్తిగా ఔట్ డేటెడ్ క‌థాంశంతో రూల‌ర్ తేలిపోయాడ‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

అయితేనేం బాల‌య్య‌కు మాస్ ఇమేజ్ అంతో ఇంతో ఉండటంతో.. తొలిరోజు 4కోట్ల షేర్ వ‌సూలైంది. అయితే రూలర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలకు అమ్మారు. రూలర్ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేయటంతో..చాలా చోట్ల కలెక్షన్స్ పూర్తి గా డ్రాప్ అవటం మొదలైంది. దాంతో  ఈ సినిమా కోలుకోవడం ఇప్పుడు చాలా కష్టం అని ట్రేడ్ తేల్చేసింది.  మరోప్రక్క ఇప్పటికే మార్కెట్లో ఉన్న వెంకీమామ పెద్ద పోటీ ఇచ్చింది.