నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి అందిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 15 న రిలీజ్ అవుతోంది.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫిల్మ్ నగర్ టాక్ ఏంటో చూద్దాం.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం యావరేజ్ గా ఉండబోతోంది. రొటీన్ స్టోరీ లైన్ అని చెప్తున్నారు. హీరో క్యారక్టరైజేషన్ మాత్రం కొత్తగా ఉండబోతోందని, అది కనుక పడితే మంచి సక్సెస్ అవుతుందని అంటున్నారు. గుజరాతి చిత్రం ఆక్సిజన్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కథ అనేక సార్లు తెరపై చూసిందేనని అంటున్నారు. దానికి తోడు ఈ సినిమాకు భాక్సాఫీస్ దగ్గర పెద్దగా బజ్ లేకపోవటం మరో మైనస్ గా నిలుస్తోంది.

మరోసారి బికినీలో రెచ్చిపోయిన రకుల్!

మరో ప్రక్క సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాలు రెండు హిట్ టాక్ తెచ్చుకోవటంతో పెద్ద పోటీనే ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొన్ని ఎలిమెంట్స్ రూరల్ ఆడియన్స్ ఎక్కుతాయని మల్టిఫ్లెక్స్, ఓవర్ సీస్ మాత్రం సందేహమే అంటున్నారు. అయితే ఇదంతా కేవలం ఫిల్మ్ నగర్ టాక్ మాత్రమే. సినిమా రిలీజ్ అయితే కానీ ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియదు.

ఇక ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర...జీవితాన్ని ఓ స్టేజీలా భావించి, అందరూ కూడా నటులే అని నమ్మి , ఆచరిస్తూంటాడు. అతను తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తూంటాడు. ఇతరులను ఆనందపరచటం లో ఆనందం ఉందని నమ్మతాడు. అందుకోసం ఏ పనిచేయటానికైనా, ఎంత దూరమైనా వెళ్లటానికి సిద్దపడతాడు. ఈ క్రమంలో అతను ప్రేమను, ఎఫెక్షన్ ని పొందుతాడు. జీవితాన్ని సార్దకం చేసుకుంటాడు.

 మెహరీన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు.వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్‌ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్‌ శ్రీను నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: గోపీ సుందర్‌.