క్రితం సంవత్సరం ’118’ తో మంచి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. మరోవైపు ‘శతమానం భవతి’, వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టేనర్‌తో అలరించిన దర్శకుడు సతీష్ వేగేశ్న. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కుటుంబ కథా చిత్రం  ‘ఎంత మంచివాడవురా. ఇంతకాలం మాస్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్..సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తొలిసారి ఫ్యామిలీ ఎంటర్టేనర్ సినిమా చేస్తూండటంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీతో కళ్యాణ్ రామ్‌కు సతీష్ వేగేశ్న మంచి హిట్ అందించలేకపోయారని మార్నింగ్ షోకే తేలిపోయింది.  ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కు కన్నీళ్లు ఒకటే తక్కువని అంటున్నారు. అంతగా డిజప్పాయింట్ అయ్యాడట.

ఎన్టీఆర్ ని 'తమ్ముడు' అని పిలవను : కళ్యాణ్ రామ్

మొదటి రోజు కొన్ని చోట్ల 'ఎంత మంచివాడవురా' సినిమాకి ఫరవాలేదనిపించే ఓపెనింగ్స్‌ అయితే వచ్చినా.. చాలా చోట్ల ఈ సినిమా మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేకపోయింది. దానికి తోడు ఈ సంక్రాంతికి రిలీజైన 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' పోటా పోటీగా కలెక్షన్స్ తో దూసుకుపోతూండటంతో.. జనం ఇంకో సినిమా గురించి ఆలోచించే పరిస్దితి లేకపోవటం గమనార్హం. దానికి తోడు మార్నింగ్ షో తోనే రిజల్ట్‌ తేలిపోవడంతో, 'ఎంత మంచివాడవురా' వైపు వెళ్లటానికి ఇంట్రస్ట్ చూపటం లేదు ప్రేక్షకులు.

చాలా చోట్ల మార్నింగ్‌ షో కూడా ఫుల్‌ అవకపోవటమే ఈ సినిమా రిజల్ట్ చెప్పేస్తోంది. దాంతో నిన్న ఈవెనింగ్ కు వచ్చేసరికి పది మంది కూడా చాలా చోట్ల రేకపోయేసరి...  ఆ సినిమాని తీసేసి, 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో' షోస్‌ వేస్తున్నారని తెలుస్తోంది.  ఈ రోజు ఈ సినిమా చాలా థియేటర్ల నుంచి తీసేస్తారనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది.  

 మెహరీన్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్‌ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్‌ శ్రీను నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: గోపీ సుందర్‌.