టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న చిత్రం జాన్. సాహో సినిమాతో మెప్పిస్తాడని అనుకున్న ప్రభాస్ తీవ్రంగా నిరాశపరచడంతో నెక్స్ట్ సినిమాతో అయినా మెప్పిస్తాడని అభిమానులు జాన్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు. ఇకపోతే ఆ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది.

విదేశాల్లో కొంత షూటింగ్ ని ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ నెక్స్ట్ హైదరాబాద్ లోనే మరో షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది.  జాన్ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటె సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనుందట. టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ గతంలోనే ప్రభాస్ తో రెండు సినిమాలు చేసింది.

డార్లింగ్ - మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి.  ఇక ఇప్పుడు మూడవసారి కూడా సక్సెస్ అందుకోవడానికి ఈ కాంబో తెరపై కనిపించనుందట. కాకపోతే కాజల్ ప్రభాస్ తో ఎక్కువ సేపు కనిపించదట. ఒక పది నిమిషాల అతిధి పాత్రలో జాన్ సినిమాలో మెరవనుందట.

ఇకపోతే జాన్ సినిమాలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే కాజల్ పాత్రపై చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనుంది. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ - గోపికృష్ణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అసలు సమస్య అదేనా..?