ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నారు. మహిళలు చనువిస్తేనే మగాళ్లు దాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని అన్నారు. దీంతో అతడిపై ఫెమినిస్ట్ లు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ భాగ్యరాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలనికోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. తాజాగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా అతడిపై తీవ్రంగా మండిపడింది.

విజయ్ దేవరకొండ కొత్త ఇల్లు.. ఎంతో తెలుసా..?

ఇంతకీ భాగ్యరాజ్ ఏమన్నారంటే.. మహిళలపై వేధింపులు, అత్యాచారం కేవలం మహిళల అజాగ్రత్త వల్లే జరుగుతున్నాయని..  ఈ రోజుల్లో మహిళలు ఎప్పుడూ చూసినా ఫోన్‌లలోనే ఉంటున్నారని.. రెండేసి ఫోన్‌లు, సిమ్‌లు వాడుతున్నారని అన్నారు. వారిపై అనేక ఘోరాలు జరగడానికి ఇది ఓ కారణమని.. మహిళలపై కట్టుదిట్టంగా రూల్స్  విధించినప్పుడు ఇలాంటి తప్పులేమీ జరగలేదని అన్నారు.

అలాగే తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి సంఘటనపై స్పందిస్తూ ఇందులో మగవాళ్లు పైన మాత్రమే నిందలు వేయడం సరికాదని అన్నారు. అమ్మాయిలు చేసిన పొరపాటును వాళ్లు ఉపయోగించుకున్నారనీ, వారు అజాగ్రత్తగా ఉన్నందునే ఇలాంటి ఘటనలు జరుతున్నాయన్నారు.

అక్కడితో ఆగకుండా మగాళ్ల విచ్చలవిడి సంబంధాలను సమర్ధించుకొచ్చిన ఆయన ఒక పురుషుడు పొరపాటు చేస్తే, సరిద్దుకుంటాడు. అదే మహిళలు తప్పు చేస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చిన్మయి ట్విట్టర్ వేదికగా స్పందించింది. మహిళల వలనే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ సినీపరిశ్రమ పెద్దలు చెప్పడం  బాధాకరమని.. నిజానికి ఇలాంటి వ్యాఖ్యలతోనే అమ్మాయిలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.